A slightly modified version of the apostles' creed in Telugu:
అపొస్తలుల విశ్వాస ప్రమాణము
ఆకాశమును భూమిని సృష్టించిన, సర్వశక్తిగల తండ్రిఆయిన దేవునిలో
మరియు తన అద్వితీయ కుమారుడు, మన ప్రభువైన, యేసు క్రీస్తులో
నేను విశ్వసించుచున్నాను
ఆయన (యేసు క్రీస్తు) పరిశుద్దాత్మ ద్వారా
జన్మించి, కన్య మరియకు పుట్టెను,
పొ౦తి
పిలాతు కింద శ్రమపడేను; సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడెను. మూడవ రోజు మృతులలోనుండి లేచెను
పరలోకానికి
ఆరోహణుడై, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను
అక్కడనుండి
సజీవులకును, మృతులకును తీర్పుతీర్చుటకు ఆయన వచ్చును
పరిశుద్దాత్మలో
నేను విశ్వసించుచుచున్నాను
పరిశుద్ధుల
సమాజమైన, పరిశుద్ధమైన సార్వత్రిక సంఘములో నేను విశ్వసించుచున్నాను
పాపక్షమాపణలో,
శరీరం యొక్క పునరుత్థానంలో, నిత్యజీవితంలో నేను
విశ్వసించుచున్నాను.
ఆమెన్.
ఇది కేవలం కొన్ని డినామినేషన్ల వారే ఉపయోగించడం విచారకరం. మన పెద్దలు, అపోస్తలులు ఎంతో శ్రద్ధతో కూర్చిన ఈ ప్రమాణాన్ని అందరూ కంఠస్థం చెయ్యాలి. సిద్ధాంతం విషయంలో సరైన ఉపదేశం లేని ఈ రోజుల్లో ఈ విశ్వాస ప్రమాణం, ఇంకా ఇలాటివి చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా బాప్తీస్మం సమయంలో కూడా ఇది చెప్పించాలి.
ReplyDeleteYes మీరు కరెక్ట్ గా చెప్పారు
Deleteఅవును అయ్యగారు, అందరూ తప్పక కంఠస్థం చేయాలి, అందరికీ నేర్పించాలి. లేని పక్షంలో అంతా అయోమయం. విశ్వాసులు అవగాహన కలిగి వుండడానికి ఇది దోహద పడుతుంది.
ReplyDelete